Categories

గుజరాత్ లోని అహమదాబాద్ లో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐ.పి.ఎస్ అధికారి మంజిరా. మంజీరా నేరస్తులను హడలెతించటమే కాదు చక్కగా కూచిపూడి, భరతనాట్యం కూడా చేయగలరు. మహిళలు పీరియడ్స్ గురించి ప్రజల ఆలోచనా ధోరణి మార్చాలన్న అవసరం ఉందని చెపుతూ ఉందని ఒక రోజు తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అహమ్మదాబాద్ లో క్రైమ్ మీటింగ్ జరుగుతుంది. కొన్ని గంటల కొద్ది నేను మీటింగ్ లో కర్చున్న ఆ సమయంలో నెలసరి వచ్చి యూనిఫామ్ పైన మరక ఏర్పడింది . అక్కడున్న వాళ్లు అందరూ మగవాళ్లే .మహిళా పోలీస్ అధికారిని నేనొక్కదాన్నే . అందరు చూస్తూ ఉండగానే నేను సెల్యూట్ చేసి వచ్చేశాను . అన్ని చెప్పారామె . పీరియడ్స్ గురించిన అవగాహన ప్రజల్లో ఇంకా రావాలని చెప్పుకొచ్చారామె .