జయ్ శ్రీరామ్..జయ్ శ్రీరామ్.

హనుమంతునికి శ్రీరామచంద్రమూర్తి పట్ల ఉన్న భక్తి అపారమైనది కదా.అనుక్షణం స్వామివారి సన్నిధిలో సేవ చేసి తరించాలని భక్త జనులకు బోధ చేశాడు.శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు ఆఙ్ఞ మేరకు వనవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా వెంట ఉండి వారికి సేవ చేసేవాడు.
సీతమ్మని అపహరించిన లంకాధిపతి రావణుని సంహరించటానికి శ్రీరామునికి హనుమంతుడు ఇచ్చిన ధైర్యం చెప్పరానిది.సీతాన్వేషణలో హనుమంతుడు లంకకు చేరి సీతమ్మను దర్శనం చేసుకున్నాడు.ఆమె శ్రీరామచంద్రమూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని సింథూరం ధరించేది.అది చూచి హనుమంతుడు తన శరీరమంతా సింథూరం రాసుకుని స్వామివారి పై తన భక్తిని చూపించాడు.
నిత్య ప్రసాదం:కొబ్బరి,అప్పాలు, శనగలు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment