కొన్ని ఆహార పదార్థాలు శరీరాన్ని తేలికగా ఉంచుతాయి హుషార్ గా అనిపిస్తుంది కూడా. ఇలా శరీరాన్ని చలాకీగా ఉంచే ఆహర పదార్థాల్లో ముందే ఉంటుంది బీట్ రూట్ . దీనిలోని నైట్రేట్ల కారణంగా కర్త నాళాలు వ్యాకోచించి రక్త సరఫరా మెరుగై బిపి తగ్గుతుంది. ఫలితంగా మెదడు పనితీరు బావుంటుంది. అలాగే అరటిపండులో పోటాషియం విటమిన్ బి శక్తి నిచ్చి శరీరానికి చురుకు దనం తీసుకువస్తాయి. చిలక దుంపలోని సంక్లిష్టమైన పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణం అవుతూ శక్తిని ఇస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్ ఆమ్లాలు మెదడును మెగ్నిషియం సెరటోనిక్ హార్మోన్ విడుదల పెంచి ఆనందంగా ఉండేలా చేస్తుంది.

Leave a comment