శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేసినట్లే మానసిక ఆరోగ్యం కోసం కనీసం 15 నిమిషాలు ఖర్చు పెట్టండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని ప్రయత్నించాలి. బయటకు పోయి ఒక కప్పు కాఫీ తాగడం, ఏదైనా చదువుకోవడం, పాటలు వినటం ఏదో ఒకటి ఆ నిమిషానికి ఏది బాగుంటుంది అనిపిస్తే దాన్నే చేయాలి తర్వాత ఆ చేసిన పని గురించి డైరీ రాయాలి. ఆ నిమిషంలో మనసులో రేగిన భావోద్వేగాల గురించి రాయాలి. ఒత్తిడితో నిండిన ఉద్యోగ భారాన్నించి మనసు డైవర్ట్ చేసేందుకు సాయంత్రం విండో షాపింగ్ వంటివి చేయాలి. మనుషుల సమూహాల్లో నడవాలి అయితే మాస్క్ మాత్రం పెట్టుకోవాలి. ఒక వారం తర్వాత సమీక్ష చేసుకుంటే మానసిక స్థితి ఎలా ఉందో ఎవరికీ వాళ్ళు కు ఒక అవగాహన వస్తుంది.

Leave a comment