ఇల్లు, పాత్రలు శుభ్రం చేసినట్లే వాషింగ్ మిషన్ నుంచి పవర్ హెడ్ దాకా అన్ని శుభ్రం చేయాలి. వాషింగ్ మిషన్ లో మూడు వంతులు వెనిగర్ను డిటర్జెంట్ కంపార్ట్మెంట్ ద్వారా పంపి మిషన్ ఆన్ చేయాలి. వేడినీటి సెట్టింగ్స్ పెడితే మంచిది రెండు నెలలకోసారి ఇలా చేస్తే వాషింగ్ మిషన్ క్లీన్ గా ఉంటుంది. టీవీ, కంప్యూటర్ తెరలను మైక్రో ఫైబర్ క్లాత్ తో తుడవాలి. మరకలు అనిపిస్తే లిక్విడ్ సోప్ నీళ్లతో తడిపి తుడవాలి. కీబోర్డ్, రిమోట్ లను వెనక్కి తిప్పి దులిపి శానిటైజర్ చల్లిన వస్త్రంతో తుడిస్తే చాలు ఒక ప్లాస్టిక్ కవర్ లో వైట్ వెనిగర్ పవర్ హెడ్ మునిగేలా కవరు అమర్చి గంట తర్వాత టూత్ బ్రష్ తో రుద్దితే సరిపోతుంది.

Leave a comment