Categories
మాస్క్ లు ధరించడం సరే వాటి గురించి సరైన శ్రద్ధ తీసుకోకపోతే మాస్కుల వల్లే అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు డాక్టర్లు . సబ్బు నీళ్ళు , ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లతో తరచూ చేతులు శుభ్రంగా కడుకుంటేనే మాస్క్ లు ధరించిన ప్రయోజనం నెరవేరుతోంది .మాస్కులు ఎలా ధరించాలి వాడిన తరువాత వాటిని ఎలా నిర్వీర్యం చేయాలో ముందే అవగాహనా చేసుకోవాలి .మాస్క్ పై భాగంలో ఉండే స్ట్రిప్ ముక్కుని పూర్తిగా కప్పుతూ పైకి ఉండాలి కింద స్ట్రిప్ గడ్డం కింద వరకు రావాలి. అప్పుడే ముక్కు నోరు భాగాలను మాస్క్ పూర్తిగా కవర్ చేస్తుంది .