స్త్రీలకైనా పురుషులకైనా వయసు పెరిగే కొద్దీ పొట్ట పెరిగి పోతుంటుంది. అయితే స్త్రీలు రోజుకో అవకాడో తింటే పొట్టలోని కొవ్వు తగ్గుతోందని చెబుతున్నారు ఇలినాయిస్‌ యూనివర్సిటీ నిపుణులు. సాధారణంగా చర్మ కణాల అడుగు భాగంలో కానీ, పొట్ట లోపలి అవయవాల చుట్టూ కొవ్వు కణాలు పేరుకొంటాయి. ఈ కొవ్వు వల్లనే మధుమేహం పెరుగుతుంది కూడా. అవకాడో తిన్న వాళ్ళు కొవ్వు పట్టిన లోపల అవయవాల చుట్టూ పేరుకోకుండా చర్మం అడుగుభాగాన్నే పేరుకుంటుంది. దానితో అవి తిన్న వాళ్లలో పొట్ట చాలా తేలికగా తగ్గిపోతుందని పరిశోధకులు గుర్తించారు.

Leave a comment