పిల్లల కోసం ప్రత్యేకం ఒక గది ఉంటేనే బావుంటుంది. వాళ్ళకి నచ్చేలా, వాళ్ళు కోరుకున్న బొమ్మలు అందుబాటులో ఉండేలా అలంకరించవచ్చు. ఆ ప్రత్యేకమైన గది అందంగా వుండాలి. గోడలు దుప్పట్లు ఆహ్లాదకరమైన గులాబీ, పసుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో వుంటే బావుంటాయి. గోడలపై డిజైన్స్ వద్దు. పెద్ద కార్లు, బార్బీ బొమ్మలు , పక్షులు డిజైన్ గా బాగుంటాయి. అసలు గది గోడలు పిల్లలు రాసుకునే బ్లాక్ బోర్డుల్లా వుండాలి. అలాగే గదుల్లో మిగతా వస్తువులు వద్దు వారికి అందే ఎత్తులో ఆట వస్తువులు వుండాలి. ఉహ తెలిసిన పిల్లలుంటే వాళ్ళకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటే వాళ్ళ ఇష్టాలు ఆ రూమ్ కి ప్రత్యేకత  ఇవ్వచ్చు. పిల్లలకు వస్తువులు సర్దుకోవడం, గది నీట్ గా ఉంచుకోవడం అలవాటు చేయాలంటే ఈ స్పెషల్ గది ఇవ్వడమే అవసరం.

Leave a comment