చదువు ముగించి  ఉద్యోగంలో చేరితే అక్కడ ఆ వాతావరణం లో కుదురుకునే వరకు అన్నెన్నో సందేహాలు. తోటి వాళ్ళతో ప్రవర్తన పై అధికారులతో ఎలా మెలగాలో అంటా వట్టిదే. అయితే సానుకుల దృక్పదం తో కార్యాలయంలో అడుగు పెడితే  సగం సందేహాలు పోతాయి. వేసుకునే దుస్తులు అవతలి వారికి ఒక అభిప్రాయం కలిగిస్తాయి. వీలైనంత వరకు హుందాగా వుండే దుస్తులు ధరించాలి. అలంకరణ ఎంతో మితంగా వుండాలి. కార్యాలయంలో ఉన్నాంత సేపు పని గురించే ఆలోచించాలి. దాని వల్ల పనులు వేళళు పూర్తి అవ్వుతాయి. ఇక వ్యక్తి గత పనులకు సమయం ఇవాల్సిందే. ఆఫీస్ వేళలు పూర్తి అయ్యాకే ఇలా సమన్మయం  చేసుకోలేకపోతే వత్తిడి తప్పదు. ఎలాంటి సందేహాలు భయాలు అనవసరం, చేసే పనికి ఆద్రుట ఉండబట్టే యాజమాన్యం తో ఎక్కడైనా రాణించవచ్చు.

Leave a comment