నీహారికా,

చిన్నప్పుడు ఏ పనీ నేర్చుకోక చాలా మంది పిల్లలు పెద్దయ్యాక ఏ ఉద్యోగం కోసమో వంటరిగా వుండవలిసి వస్తే చాలా ఇబ్బందులు పడతారు. ఆరేళ్ళ వయస్సు నుంచే పిల్లలకు పనుల్లో శిక్షణ ఇవ్వాలంటారు చిల్డ్రన్స్ సైకాలజిస్టులు. మెచ్చుకోలు గా మాట్లాడితే పిల్లలు తప్పని సరిగా మన మాట విని ఏ పని అయినా నేర్చుకుంటారు. పిల్లల చేత తోట పని చేయించ వచ్చు. మొక్కలకు నీళ్ళు పోయించవచ్చు. ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దాన్ని చక్కగా పాక్ చేయిమని చెప్పవచ్చు. కూరలు కట్ చేయమని తల్లి వంటింల్లో తనకు సాయం చేయమని అడిగి ప్రేమగా వాళ్ళకు పనులు నేర్పాలి. కొంచెం పెద్దవ్వుతున్న పిల్లలకు ప్రధమ చికిత్స గురించి చెప్పుకోవచ్చు. చిన్ని గాయం అయినా అయితే ఎలా బ్యాండేజ్ వేసుకోవాలో నేర్పాలి. బాతి రూమ్ శుబ్రం చేయమని ప్రోత్సహించాలి. తల్లితో పాటు పనులు చేసేలా చూడాలి. షాపింగ్ మెళకువలు నేర్పాలి. అవసరమైన వస్తువులు ఎంత మేరకు ఎలాంటి బ్రాండ్ ఎంచుకోవాలో నేర్పితే తప్పించి పెద్దయ్యాక వాళ్ళు నేర్చుకోలేకపోతారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి పనులు నేర్పితేనే వాళ్ళకు నెమ్మది మీద అలవాటు అవ్వుతాయి.

Leave a comment