Categories
Gagana WhatsApp

కృత్రిమ గుండె.. కాలిన ముఖం.. అయితేనేం ‘మిస్ వరల్డ్ అమెరికా’

అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే తన హృదయ స్పందన నిమిషానికి 20 సార్లు మాత్రమే. అందుకే పేస్‌మేకర్ మేకర్‌ అమర్చిన డాక్టర్లు డ్యాన్స్ చేయద్దన్నారు. కానీ పట్టుదలతో గంటల తరబడి డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేసింది. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఓ కారు ప్రమాదంలో ముఖం ఎడమవైపు పూర్తిగా కాలిపోయింది. ‘ఇక అందాల పోటీలకు ఏం వెళుతుందిలే’ అనుకున్నారు. కానీ అందరూ అసాధ్యమనుకునే పనులను సుసాధ్యం చేసే అలవాటుతో ఏకంగా ‘మిస్ వరల్డ్‌ అమెరికా’ కిరీటాన్నే అందుకుంది. ఆమే 25 ఏళ్ల శ్రీ సైని. లాస్‌ ఏంజెలిస్‌లోని ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ ప్రధాన కార్యాలయంలో ఇటీవల ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా- 2021’ పోటీలు జరిగాయి. వివిధ దేశాల అందగత్తెలు ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ కోసం పోటీ పడ్డారు. అయితే ఆ అదృష్టం మాత్రం భారత సంతతికి చెందిన శ్రీ సైనీకి దక్కింది. మాజీ మిస్‌ వరల్డ్‌లు డయానా హెడెన్, థాన్యా మెమే చేతుల మీదుగా ఈ అందాల కిరీటం అందుకుందీ యంగ్‌ బ్యూటీ.

Leave a comment