Categories
మిగతా రంగాలతో పోలిస్తే మహిళ పైలెట్లు రాణించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఫ్లైటిక్ ఏవియేషన్ అకాడమీ నిర్వహిస్తున్న కెప్టెన్ మమత హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శిక్షణా కేంద్రం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పదివేల మంది పైలెట్లకు సుదీర్ఘమైన కెరీర్ లో కొనసాగేందుకు అవకాశాలున్నాయి. కమర్షియల్ పైలట్ కు నెలకు గరిష్టంగా 120 గంటలు మించి పర్మిషన్ ఉండదు కనుక కుటుంబంలో కుటుంబంతో కలిసి గడిపే సమయం ఎక్కువ గానే ఉంటుంది. ప్రసూతి సెలవులు ఉంటాయి 65 ఏళ్ల వరకు ఈ వృత్తి కొనసాగించవచ్చు అంటారు కెప్టెన్ మమత.