దిశ చట్టానికి స్పెషల్ ఆఫీసర్ గా నాకు భాద్యతలు అప్పగించటం మంచి అవకాశంగా భావిస్తున్నాను. చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయటం కోసం పోలీస్ శాఖ న్యాయశాఖ స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఫోరెన్సిక్ సంస్థల సమన్వయం తో పని చేయబోవటంతో ఎప్పటికప్పుడు తక్షణ స్పందన ఉంటుంది అంటున్నారు ఐ.ఏ. ఎస్ ఆఫీసర్ కృతిక శుక్ల ఆమె జమ్ము అండ్ కాశ్మీర్ 2013 ఐ.ఏ. ఎస్ మహిళ రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఎ.పి దిశ చట్టం 2019 అమలుకు ప్రత్యేక అధికారి. ప్రతి జిల్లా లో దిశ కోర్టు ను ఏర్పాటు చేసి మహిళలు,పిల్లలపై జరిగే లైంగిక దాడులపైనా వేంటనే విచారణ చేపడతాం అంటోంది కృతిక శుక్ల.

Leave a comment