ప్రపంచంలో తొలిసారిగా పీరియడ్ పావర్టీ బిల్లు తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకొంది. బిల్లు చట్టం కాగానే దేశవ్యాప్తంగా మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా లభిస్తాయి. అరకోటికి పైగా జనాభా, ఉన్నారు స్కాట్లాండ్ లో ప్రతి పది మంది బాలికల్లో ఒకళ్ళు ప్యాడ్స్ కొనే స్థితిలో లేని వారే అలాగే 14- 21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికల్లో సగంమంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాడ్స్ కొనలేకపోతున్నవారే.ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం గర్వంగా భావిస్తున్నాను అని స్కాట్లాండ్ ప్రధాని నికోలా స్టర్జన్ ట్వీట్ చేస్తూ మహిళలకు బాలికలకు ఇది అవసరమైన
ప్రభుత్వ విధానంగా ఈ చట్టాన్ని అభివర్ణించారు. అన్ని పేదరికల మాదిరిగానే ప్యాడ్స్ కొనలేని పేదరికం కూడా ఉంటుందని ఈ బిల్లుకు ఊపిరి పోసి బిల్లు సాధనం కోసం, సభ ఆమోదం పొందేవరకు అవిశ్రాంతి పోరాటం చేసిన మోనికా లెన్నాన్ ఇప్పుడు దేశంలోని మహిళల మన్ననలు పొందుతున్నారు.

Leave a comment