ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి కృతి కుమార్ బ్రాండ్ అంబాసిడర్  ఎంపిక చేసింది.ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గార్వాల్ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త గా చేరింది.కృతి కుమారి ఆ ప్రాంతంలోని నిరుపేద మహిళ రైతులు పండించే చిరుధాన్యాల తో వారికి ఐరన్ లడ్డు తయారీ నేర్పించింది. వాటిని అంగన్ వాడి కేంద్రాలు ద్వారా చిన్నారులకు అందేలా ప్రభుత్వం అనుమతి తీసుకుంది.అలాగే తక్షణ శక్తినిచ్చే ఊర్జా అనే ఆహారపదార్థం ఫార్ములా అందించి ఆ పదార్థాన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలకు పంపిణీ చేసే అనుమతి తీసుకుంది.అలాగే పండ్లతో సిరప్ లు జెల్లీ మురబ్బా న్యూట్రిషన్ బార్ లు తయారుచేయించి జిల్లావ్యాప్తంగా సూపర్ మార్కెట్ లలో విక్రయించే ఏర్పాట్లు చేయించింది. సగటున ప్రతి మహిళ నెలకు పదివేల ఆదాయం పొందేలా వ్యాపారం చేయించిన కృతి కుమారి బ్రాండ్ అంబాసిడర్ కావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

Leave a comment