www.fb.com/Glowtide చూడండి. ఈ సంస్థ నిర్వాహకురాలు రీనా. ఈ ఎన్జీవో లో ఎంత మంది యువత భాగస్వాములు హైదరాబాద్ లోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్ళలో మిగిలిపోయిన ఆహారం సేకరించి అదే రోజు అనాధలకు పేద పిల్లలకు అందజేస్తారు. 15 సంవత్సరాల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలోని పని చేసి వచ్చారు రీనా. పెళ్ళిళ్ళు వేడుకల్లో మిగిలిపోయిన ఆహారం ఇచ్చేందుకు కూడా ఈ సంస్థకు సమాచారం ఇస్తాం. హైదరాబాద్ లో అంత పాప్యులర్ అయింది ఈ ఎన్జీఓఎక్కడ ఆహారం వృధా అయిపోతుంది అని మెసేజ్ అందగానే ఆ చుట్టు పక్కల శరణాలయాల వివరాలు చూస్తారు. ఆ ఆహారం అక్కడికి వెళ్ళేలా చేస్తారు. ఇప్పుడు ఇంకో ఆలోచన చేస్తున్నారు. హోటళ్ళు పెద్ద రేస్తురెంట్ల ముందు ప్రీజర్లు ఏర్పాటు చేయడం. రాత్రి మిగిలిన ఆహారం అందులో ఉంచితే అది పాడైపోకుండా మరునాటి ఉదయం పేద పిల్లలు, దీన్ని కలక్ట్ చేసుకుంటారు. ఆహారం వృధా కాకుండా చూడటం ఈ ఎన్జీఓ లక్ష్యం. ఆలోచన బాగుంది. ఈ సమాచారం హైదరాబాద్ మొత్తం అందేలా చేదాం.

Leave a comment