Categories
ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు గడిపే వారికి కళ్లు మంటగా ఉండటం, ఎర్రబడటం, మసకబారటం అనిపిస్తే కళ్ళు పొడిగా అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. అలా పొడిబారకుండా ఉండేందుకు గోరువెచ్చని నీళ్లలో ఒక మెత్తని వస్త్రాన్ని కాసేపు నాననివ్వాలి. దాన్ని పిండి కనురెప్పల పై పెట్టుకొని ఐదు నిమిషాలు అలా ఉంటే కళ్ళు పొడిబారవు.కొంచెం కలబంద గుజ్జు కనురెప్పల పైన పూయాలి.పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే చాలు ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే కళ్ళు పొడిబారవు. అలాగే రోజ్ వాటర్ తో ముంచిన దూదిని కనురెప్పలపై పెట్టుకోవాలి పది నిమిషాలు అలా ఉంచాలి.తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి రోజ్ వాటర్ లోని విటమిన్ ఎ కళ్ళు పొడిబార నివ్వదు.