ముప్పయిలు దాటి నలభైల్లోకి అడుగుపెడుతూ ఉండగానే అప్పటివరకు నున్నగా అందంగా కనబడే ముఖంపైన చిన్న మచ్చలు మొదలవుతాయి. రొటీన్ గా ఎదురయ్యే ముడతలకు తోడుగా అన్నమాట. దీన్ని పిగ్మేంటేషన్ అంటారు. అప్పుడు ఇంట్లో చేసుకొనే ట్రీట్మెంట్ ఇది. ముఖాన్ని నిమ్మరసంతో కానీ స్కిన్ టానిక్ లతో కాని శుభ్రంగా తుడవాలి. స్కిన్ టానిక్ రెడీమేడ్ గా దొరుకుతుంది. గ్రేప్ పౌడర్, కోడి గుడ్డు సోన, సీ ఫుడ్ లోషన్స్ ఒక్కో స్పూన్ వంతున తీసుకొని బ్రష్ తోగానీ, ముని వేళ్ళతో గానీ ముఖానికి పట్టించాలి. ప్యాక్ ఆరాక కొద్దిగా పచ్చిపాలతో ముఖాన్ని మర్దన చేయాలి. మసాజ్ పూర్తయ్యాక ముఖం క్లీన్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ తో మళ్ళీ ప్యాక్ వేయాలి. రెండు మూడు రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి గోరు వెచ్చని పాలతో కలిపి ఈ ప్యాక్ వేయాలి. పది నిముషాలు ఆరాక పచ్చిపాలతో మర్ధన చేసి ప్యాక్ తుడిచేయాలి. చివరగా కమలా పండు రసం గానీ, బంగాళా దుంప రసం గానీ తీసి మునివేళ్ళతో ముఖంపైన మర్ధనా చేసి చివరగా బాగా పండిన పండుతో ప్యాక్ వేయాలి. ఇలా వారానికి ఒకసారి వేస్తే మొహం చర్మం బిగుతుగా వుంటుంది. ఎలాంటి మచ్చలైనా పోతాయి.

 

Leave a comment