స్నానాల గదులు వంటింటి సింకులు తలుపులు గట్టిగ మూసేసి కాబోర్డ్స్ వాసనా గా ఉంటాయి. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు పండ్లు పాలు , పెరుగు నిల్వ చేసే ఫ్రిజ్ కూడా . ఇలాంటప్పుడు ఇంట్లో వాడేసిన నిమ్మ చెక్కలు లేదా నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు తరిగి గాని ఫ్రిజ్ ట్రే లో పడేసి ఇందులో ఒక చుక్క వెనిగర్ ని కలిపి డీప్ ఫ్రిజ్ లో పెట్టేస్తే అవి తెల్లారేసరికి గట్టిగా అయిపోతాయి. ఈ ఐస్ క్యూబ్స్ ని ట్రే నుండి తీసేసి జిప్ లాక్ బ్యాగ్ లో వేసి భద్రపరచాలి. ఈ నిమ్మముక్కల ఐస్ క్యూబ్స్ ఎంతో ఉపయోగపడతాయి . దుర్వాసన వచ్చే స్నానాల గదులు సింకుల్లో ఈ ముక్కలు పడేస్తూ నెమ్మదిగా కరిగిపోతాయి. వాసనా లేకుండా చేస్తాయి. పైగా నిమ్మ పరిమళం తో ఉంటాయి. ఇలా లాక్ చేసిన కప్ బోర్డ్స్ లో గంధపు ఉండలు కలరా ఉండలు ఎండిన పువ్వులు తప్పకుండా ఉంచాలి. ఇప్పుడు బజార్లో ఎన్నోరకాల పువ్వులు నింపిన ప్యాకెట్లు వస్తున్నాయి. వీటిని హాల్లో టేబుల్ పైన పెట్టినా మంచి వాసన వస్తాయి. ఇది మల్లెల కాలం . గుప్పెడు మల్లెల్లు సన్న జాజులు చాలు ఇల్లంతా సువాసన వచ్ఛేయటానికి.