క్వీన్ రీమేక్ లో నటిస్తోంది అమలా పాల్. మలయాళం క్వీన్ రీమేక్ గురించి అమలా చాలా సంతోషంగా వుంది. రేవతి దర్శకత్వంలో నటించటం చాలా నచ్చిందట. అమ్మ నాన్న నేను అందరం ఆమె వీరాభిమానులం. అంటోంది అమలా పాల్. ఈ సబ్జెక్టు ను ప్రతి చోటా చెప్పాలి. దీని ప్రభావం విడుదలైన ప్రతి చోటా ఉంటుంది. ఎందరో మహిళలు రిలేట్ అవుతారు. మహిళల వికాసం తమని తాము అందంగా మలుచుకోవడం తెలుసుకుంటారు. క్వీన్ కథను కేరళ పద్దతి లో చెపితే బావుంటుందనుకుంటున్నాను అన్నారామె. సూసీ గణేష్ ‘ తురుట్టు పాయిలె ‘ ధనుష్ వి ఐ పి  -2 ,వడచెన్నయ్ , సిన్ద్రిల్లా క్వీన్ చిత్రాల్లో చాలా బిజీగా వుంది అమలా పాల్. వడ చెన్నయ్  లో నార్త్ చెన్నయ్  అమ్మయిగా నటిస్తోంది అమలా పాల్. శారీరికంగా చాలా మారాలి. ఇది పీరియడ్ ఫిల్మ్. అంతా  సహజంగా ఉంటుంది. ఇదో మంచి సబ్జెక్టు. అలాగే చెన్నయ్ లో వేగన్ రెస్టారెంట్ ప్రారంభిస్తాను . రెస్టారెంట్ తో పాటు యోగా మెడిటేషన్ కూడా నేర్పిస్తాను. మరింత క్రమశిక్షణ గా ఆరోగ్యంగా నా జీవన శైలి మార్చుకుంటున్నాను అంటోంది అమలా పాల్ .

Leave a comment