చర్మం అందంగా నిగారింపుతో కనిపించాలంటే స్నానానికి కాస్త సమయం ఎక్కువ కేటాయించండి అంటున్నారు నిపుణులు.గులాబీ రేకులు, పంచదార, రోజ్ ఆయిల్ కలిపిన మిశ్రమంతో స్నానానికి ముందు ఒంటికి మసాజ్ చేసుకుంటే ఆ సువాసనకు వాటిలోని సౌందర్య సుగుణాలకు చర్మం మెరిసిపోతుంది.స్నానం చేసే నీళ్ళలో రెండు స్పూన్ల లావెండర్ బాత్ సాల్ట్ వేసి స్నానం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.బాత్ బాంబ్స్ రోజ్, లావెండర్, మింట్ వంటి ఎన్నో రకాల్లో మార్కెట్ లో దొరుకుతున్నాయి ఇవి స్నానం చేసే నీళ్ళలో వేస్తే చర్మం పై పేరుకొన్న దుమ్ము, ధూళి కణాలు,మృత కణాలు పోయి చర్మం మెరిసిపోతుంది.

Leave a comment