ధీమాగా జీవించాలంటే, మాట్లాడాలంటే మానసిక శక్తి కావాలి. ఎవరిని వాళ్ళు బలంగా నమ్ముకోవాలి. నన్ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అని ప్రియాంకా చోప్రా గర్వంగా చెప్పుతుందీ అంటే ఆమె ఒక్క బ్రాండ్, ఇండియన్ సినిమా సూపర్ స్టార్. అమెరికా టీవి సిరీస్ లో తిరుగులేని నటి. హాలీవుడ్ లో సినిమా అవకాశం ఇవన్నీ కలిపి ప్రియాంక. ప్రియాంకా చోప్రా ఫౌండేషన్ పై ఆడపిల్లల చదువు, సమాజంలో ఆడవాళ్ళు వెనకబదిపోవడాన్ని, ప్రశ్నించే కార్యక్రమాలు యూనిసెఫ్ తరఫున తన సమయం, తన సంపద ఖర్చు చేస్తున్న ప్రియాంకా చోప్రా, టెలివిజన్ నటుల్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా ఫోబ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. మిస్ వరల్డ్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కంటే ఇన్ స్పిరేషన్ ఇంకెవరు వుంటారు.

Leave a comment