Categories
పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు పెరిగిపోతున్నారు. నాలుగు మొక్కలు ఎలాగైనా పెంచాలను కుంటున్నారు. ఇపుడు పాశ్యర్చ్ దేశాల్లో ప్రారంభమైన లివింగ్ హాల్స్ కాన్సెప్ట్ మన వరకు వచ్చేసింది. నిలువెత్తు గోడలకు మొక్కలు పెంచేందుకు వీలుగా ఇనుపస్టాండ్లు ఏర్పాటు చేసి కుండీలో పెడతారు. లివింగ్ హాల్ కోసం కాస్త మొండి మొక్కలిని ఎంచుకుంటారు. పదిహేను రోజుల కొకసారి నీళ్ళు చల్లిన బతికి ఉండే మొక్కల్ని కుండీల్లో పెంచుతారు ఫోటోఫ్రేముల్ని తయారు చేయండి వాటిలో నాచు మొక్కల్ని తెచ్చి పెంచవచ్చు. వాటికీ నిరంతరం నీరు అక్కర్లేదు. ఎపుడొక్కసారి పోస్తే పిల్చుకుని భద్రపరిచేగుణం .ఉన్న మొక్కలను గోడల మోతంగా నాటేస్తే ఇల్లే ఉద్యానవనం అయిపోతుంది.