సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కూరగాయల అమ్మటం నామోషీగా లేదు అన్నారు కానీ ఇందులో నాకేమీ అవమానం కనిపించలేదు కష్టాన్ని నమ్ముకుని ధర్మబద్ధంగా ఏ పని చేసినా మంచిదే కదా అంటున్నారు శారద. ఇవ్వాలా సోషల్ మీడియాలో స్టార్. బీటెక్ చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న ఈ సాఫ్ట్ వేర్ అమ్మాయి శారద కరోనా సమయంలో జాబ్ పోగొట్టుకుంది. అలా ఇంటికి వచ్చిన శారద తండ్రి చేస్తున్న కూరగాయల దుకాణం లో నేరుగా వచ్చి కూర్చుంది. సాఫ్ట్ వేర్ శారదా కూరగాయల దుకాణం లో కూరలమ్మ తోందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ప్రముఖ నటుడు సోమ్ సూద్ ఆమెకు సాయం చేస్తానని ముందుకొచ్చారు. అయినా అలాంటి అవసరం వద్దులెమ్మంది శారదా కష్టకాలంలో ఇప్పుడీ పని నాకు అస్సలు కష్టం లేదంది తెలిసిన నైపుణ్యాలతో జీవితం నిలబెట్టుకోవాలని నిరూపించిన శారద ఇప్పుడు అమ్మాయిలకు స్ఫూర్తి.
Categories