Categories
వర్షాకాలంలో వైరల్ జ్వరాలు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలి అంటే శరీరం ఆరోగ్య వంతంగా రోగ నిరోధక శక్తి తో ఉండాలి. మందులతో కాకుండా ఆహారం తో దాన్ని పొందాలా అనుకొంటే బాదం పప్పు,యోగర్ట్ పెరుగు తప్పని సరిగా ఆహారంలో ఉండాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బాదం పప్పులో మెగ్నీషియం,ప్రోటీన్,జింక్ మొదలైన 15 రకాల పోషకాలు ఉంటాయి. వైరస్ బ్యాక్తీరియాల నుంచి కాపాడగలిగే ఇ-విటమిన్ కూడా ఉంటుంది. దేన్లో అయినా బాదం పప్పు కలిపి తీసుకోవచ్చు ప్రో బయోటిక్స్ పుష్కలంగా ఉండే యోగర్ట్ లో పండ్ల ముక్కలు జీడిపప్పు, బాదం పప్పు కలిపి తీసుకోవచ్చు. యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ గుణాలున్న పసుపు కూడా పాలు,మిరియాలతో కలిపి తీసుకొంటే వైరస్ దగ్గరకు రాదు.