Categories
జ్యూస్ తాగటం కంటే నేరుగా పండ్లు తినండి అంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్ల తో పాటు క్యారెట్,కీరా టమాటో ఉల్లిపాయ కలిపి తింటే మంచిది అంటున్నారు పండ్ల లో పిండి పదార్ధాలు చక్కెర లు ఎక్కువగా ఉంటాయి కనుక వాటితో పాటు బీట్ రూట్,క్యారెట్ కీరా,టమాటో,కాప్సికమ్ లు కలుపుకొని అందులో నిమ్మరసం మిరియాల పొడి కలుపుకొని తింటే మంచిది. కాయగూరలను తినలేకపోతే వాటి తో జ్యూస్ చేసుకోవచ్చు. బీట్ రూట్ ను కీరా,టమాటో తో కలిపితే రుచిగా కూడా ఉంటుంది. వెజిటబుల్స్ ఉడకబెట్టి,లేదా పచ్చిగానూ తినచ్చు నీరసం అనిపిస్తే పండ్లతో పాటు గుడ్డు,పాలు,మొలకలు,మజ్జిగ తీసుకోవచ్చు.