పని వత్తిడి మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గిస్తోందని అధ్యయనాలు ఖచ్చితంగా చెపుతున్నాయి . పిల్లలు కావాలనుకునే మహిళలకు శరీరం బరువు తగ్గించుకోమని,ఆరోగ్యవంతమైన ఆహారం మందులు సజస్ట్ చేస్తారు వైద్యులు . కానీ వర్క్ లైఫ్ బాలెన్స్ పైన దృష్టి పెడితే సంతానావకాశాలు ఉంటాయంటున్నారు అధ్యయనకారులు . సంతానోత్పత్తి సమస్యకు పనుల వత్తిడే కారణమని దానివల్ల మహిళల్లో గర్భధారణ అవకాశాలు  25 శాతం తగ్గుతాయని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి . సంతానం కోరుకొనే మహిళలకు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమని కనుక వత్తిడి తగ్గించుకో మంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment