అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే  వస్తుంది విటమిన్ ఇ. దీన్ని  ఆహారంగానూ  తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ ఋతువులోనైనా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివారు విటమిన్ ఇ  అండ్ పదార్ధాలు రోజూ  తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు చర్మానికి అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది మాత్రలు రూపంలోనూ దొరుకుతుంది. ఏ విటమిన్ తో చర్మంలో సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే కాస్త విటమిన్ ఇ  నూనె వంటివి పెటిట్ఞ్చి మర్దనా చేయాలి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మం పొడిబారే  సమస్య తగ్గి మృదువుగా మారుతుంది. ముఖ్యంగా కళ్ళ అడుగున మడతలు నలుపుదనం కూడా తగ్గుతుంది. మొటిమలు తగ్గినా వాటితాలూకు మచ్చలు మిగిలుంటే విటమిన్ ఇ  నూనె చక్కగా పనిచేస్తుంది. రాత్రిళ్ళు పడుకునేముందర ఆ నూనె రాసుకుని మర్నాడు కడిగేస్తే మురికిపోయి మొహం చక్కగా ఉంటుంది. ఎండ  ప్రభావం పడకుండా ఉండేందుకు కూడా ఈ నూనె బాగా పనిచేస్తుంది.

Leave a comment