Categories
వివాహ వయస్సు ను పెంచితే కానీ మేము చదువుకోలేమంటూ వందల మంది అమ్మాయిలు భారత ప్రధాని మోదీ కి ఉత్తరాలు రాశారు. హరియానా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 150 మంది అమ్మాయిలు వివాహ వయసు ని పెంచమని రాయటం విశేషం. హరియానా అమ్మాయిలు కొన్ని రోజులుగా లవ్ పంచాయత్ పేరుతో ప్రచారోద్యమాన్ని మొదలు పెట్టారు సెల్ఫీ విత్ డాటర్ పేరుతో ప్రచారం మొదలు పెట్టి సోదరులకు రాఖీ కట్టి మమ్మల్ని చదువుకోనివ్వండి అని మాట తీసుకున్నారు. అమ్మాయిలు చదువుకొని,సమాజానికి ఉపయోగపడే పనులు ఎన్నో చేయాలని వాళ్లకు మద్దతు పలుకుతున్నారు మహిళలు.