Categories
బ్యాంకాక్ లో జరిగిన 25వ ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో జ్యోతి యర్రాజీ మహిళల వంద మీటర్ల హర్డిల్స్ రేసులో గోల్డ్ మెడల్స్ సాధించింది. 50 సంవత్సరాల ఆశ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్ గా జ్యోతి యర్రాజీ నిలిచింది. ఆమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్. తల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయా గా పనిచేస్తుంది. 2022 సెప్టెంబర్ లో గుజరాత్ లో జరిగిన జాతీయ పోటీల్లో 12.79 సెకండ్లలో రికార్డ్ సృష్టించింది జ్యోతి.