కోల్ కతా కు చెందిన 35 ఏళ్ల యోగా టీచర్ అర్పితా రాయ్ జీవితం గొప్ప స్ఫూర్తి. ఒక ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకొన్న అర్పిత కు కృత్రిమ కాలు అమర్చారు ఎంతో బాధను భరించి ఆమె యోగా ప్రాక్టీస్ చేసింది. ఇన్ స్టా లో ఆమె ఆసనాల ఫోటోలతో ఎంతోమంది అభినందనలు అందుకుంది అర్పితా. మోకాళ్ళ దగ్గర పూర్తి నియంత్రణ ఉంటే తప్పించి యోగాసనాలు కష్టం. అలాంటిది అర్పితా కృత్రిమమైన కాళ్లతో ఉద్దండులను మరిపించేలా యోగాసనాలు వేస్తుంది. ఎంతోమందికి శిక్షణ ఇస్తోంది. నడకే అసాధ్యమనుకున్న దశ లో టీచర్ గా జీవితాన్ని దిద్దుకున్న అర్పితా ఎంతోమందికి మార్గదర్శి.