అవసరమైన పరికరాలు ఉండాలే కానీ శిరోజాల స్టయిలింగ్ చాలా ఈజీ. స్మూత్ గా పొడవుగా ఉంగరాలు తిరిగే జుట్టు కావాలనుకుంటే కర్లింగ్ టాంగ్స్ ఉపయోగపడతాయి. ఉంగరాల జుట్టున్న వాళ్ళు స్ట్రెయిట్ ప్రయోగాలు ఇష్టం అంటారు. సెలూన్ల లో ప్రొఫెషనల్స్ తో చేయించుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది. శాశ్వత పద్దతి కాకుండా ఇంట్లోనే పోకర్ – స్ట్రెయిట్ లాక్స్ తో పూర్తి చేయచ్చు. ఈ పరికరం ఉపయోగించే ముందు హీట్ ప్రొటెక్టివ్ స్ప్రే వాడుకోవాలి. శిరోజాలు నిస్తేజంగా అనిపించినప్పుడు మెరుపులతో కూడిన హేయిర్ స్ప్రే జల్లుకుంటే మార్పులు ఇట్టే కనిపిస్తాయి. ఇక పొడుగ్గా ఒత్తుగా జుట్టుంటే బ్లో డ్రయర్ అందరి ఇళ్లల్లోనూ కనిపించేదే. జుట్టు ఆరబెట్టుకునేందుకే కాదు సింపుల్ స్టయిలింగ్ కు బ్లో డ్రయర్ కావాలి. ఇక వీటన్నింటితో పాటు హేయిర్ కలరింగ్ . ఒకప్పుడు ఇది తెల్ల వెంట్రుకలను కప్పేసేది. ఇప్పడూ స్టయిల్ స్టేట్ మెంట్. కోరుకున్న షేడ్స్ లో కలర్స్ నాణ్యత డ్యూరాబిలిటీ పెరిగాయి, మంచి కండీషనర్ లు షాంపూలు ఉండనే ఉన్నాయి.
Categories