నీహారికా ,
కొత్తగా ఇన్స్పిరేషన్ కలిగించేదిగా ఉన్నా కొత్త విషయం చెపుతున్నావు గా … యూసెఫ్ ముకటీ అన్నాయన రోటీ బ్యాంక్ పెట్టాడట. ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయలేని పేదవాళ్ల కోసం ఈ రోటీ బ్యాంక్. పేదలకు సహాయం చేయాలనుకునేవాళ్ళు నగదు ఆహార పదార్ధాలు ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయచ్చు. నిర్వాహకులు వాటిని సాయంత్రం వరకు పేదలు నిరుద్యోగుల రోగులకు సరఫరా చేస్తారు. దాతల సహాయంలో ఈ రోటీ బ్యాంక్ నడుస్తుంది. ఎంతో మంది ఆహారం ఈ బ్యాంక్ కు డిపాజిట్ చేస్తారు. కల్యాణ మండపాల్లో మిగిలిన ఆహారం డిపాజిట్ చేస్తారు. దాదాపు 700 ప్యాకెట్లు ఆహారం నిల్వ చేసే కెపాసిటీ ఈ బ్యాంక్ కి ఉంది . బావుంది కదా .. 700 ప్యాకెట్ల ఆహారం నిల్వ వుంది అని గర్వంగా చెప్పటం అంటే ఇంత మంది కడుపు నింపుతారు రోజు. ఎంతోమంది రోగులు నిస్సహాయంతో ఈ బ్యాంక్ ద్వారానే పూటకోసారన్నా కడుపు నింపుకుంటారు. కానీ మన లాంటి వాళ్ళు చుట్టూ వున్న ఈ ప్రపంచంలో రెండు చేతులు దేహీ అంటూ ముందు కొచ్చి చేతులు చాపటం మన దౌర్భాగ్యమే అనుకో అయినా ఆ నిరుపేదల ఆకలి తీర్చటం మన కర్తవ్యమే కదా ! ఏమంటావు !!