ఎన్ని సవాళ్ళు ముందున్నా, ఏ రంగంలో నైనా పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఒక్క అడుగు ఎక్కువగా పోటీ పడుతున్నారు ఆడవాళ్ళు. ఇవాల్టి కార్పోరేట్ రంగంలో చాలా మంది మహిళలు తీసుకుంటున్నజీతాలు చుస్తే వాళ్ళ శక్తికి జోహార్ అవ్వాల్సిందే అధిక ఆదాయం పొందుతున్న వాళ్ళలో పెప్సీ కంపెనీ సి.ఇ.ఓ ఇంద్రా నూయి ప్రధమ స్దానంలో వున్నారు, HDFC ఎండి రేణు సుడ్ కర్నీడ్ ఆదాయం 7.1 కోట్లు. చందా కొచ్చర్ , I.C.I.C.I bank సి.ఇ.ఓ 5.85 కోట్లు కావేరీ కళా నిధి 61 కోట్లు, అపోలో హాస్పిటల్స్ సునీతా రెడ్డి 5.07 కోట్లు, ఇక ప్రపంచంలో మహిళా ఎగ్జిక్యుటివ్స్ లో, అత్యధికంగా శాలరీ అందుకుంటున్నది, యాహూ సి.ఇ.ఓ మరిస్రా మేయర్ దాదాపుగా 289 కోట్లు అందుకుంటున్నారు. ఐ.టి బ్యాంకింగ్ రంగాల్లో కుడా మహిళదే హవా. ఈ లెక్కలు చూసి, అమ్మాయిలు ఒక టార్గెట్ ఖచ్చితంగా నిర్ణయించుకోవాలని ఆశిద్దాం.