అందానికి ఎంత శక్తి ఉంది అన్న విషయం పైన పరిశోధనలు జరుగుతున్నాయి. పలు విద్యాలయల్లో పరిశోధకులు అందమైన వాళ్ళకి అధిక జీతాలుంటున్నాయని తేల్చారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వాళ్ళు పెట్టుబడులు తెచ్చుకునేందుకు ఆ కంపెనీ వ్వవస్థాపకుడు కాని, ప్రచార సారధి కానీ అందంగా ఉంటే ఎక్కువ మంది విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకోస్తారని తేల్చారు. జ్యూరిచ్ విశ్వవిద్యాలయం వాళ్ళుఅందంగా ఉన్న వాళ్లని అందరు భరిస్తారని వాళ్ళమాటలకు చేతలకు అవసరానికి మించి విలువ ఇస్తారని స్పష్టంగా చెప్పారు.కార్పొరేట్ రంగంలో జరిపిన పరిశోధనలు ,కార్పొరెట్ రంగం కూడా తెలివి తేటలకు యాభై మార్కులు వేసిన మిగతా 50 మార్కులు అందానికి వేస్తారంటున్నారు. అంత మాత్రానా అందం ఉంటే అన్ని దోరుకుతాయనుకోవద్దు.ఒక బిల్ గెట్స్,ఒక అంబానీ లేదా ఒక క్రీడాకరుడు జనాన్ని ఆకర్షించడంలో అతనిలో ఉన్న విజేతే కారణం అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్.

Leave a comment