Categories
మంచి చాక్లెట్ అనగానే విదేశీ బ్రాండ్ గుర్తుకువస్తాయి డైరీ మిల్క్, ఫ్యూస్, మార్స్, ఫైవ్ స్టార్, బోర్న్ విల్లే వంటి చాక్లెట్లు కొనేందుకు ఇష్టపడతారు. కానీ ఈ విదేశీ రకాలను పక్కన పెడుతూ సగర్వంగా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమమైన చాక్లెట్ లలో ఒక్కటిగా సిల్వర్ అవార్డ్ సాధించింది ఒక ఇండియన్ చాక్లెట్. కేరళ కు చెందిన పౌల్ అండ్ మైక్ చాక్లెట్ పూర్తిగా స్వదేశీ చాక్లెట్. 2012 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ చాకొలెట్ అవార్డ్ లు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రిటన్ అమెరికా ఇటలీ దేశాలకు చెందిన చాకొలెట్ వ్యాపారులు ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారితో చాలా దేశాలకు చెందిన వారు కలశారు. దానితో ఈ కార్యక్రమం అంతర్జాతీయంగా పేరు సంపాదించింది ప్రపంచంలో నలుమూలల నుంచి ఎవరైనా చాక్లెట్లను ఎంట్రీల రూపంలో పంపచ్చు ఫుడ్ బ్లాగర్ లతో కూడిన న్యాయనిర్ణేతలు వాటిని పరిశీలిస్తారు. వారు ఇచ్చిన మార్కులు ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు 2020-21 ఏడాది వచ్చిన ఎంట్రీల్లో కేరళకు చెందిన పౌల్ అండ్ మైక్ సంస్థ తయారు చేసిన చాక్లెట్ ఉంది. దాని రుచి, పోషకాలు వాసన న్యాయనిర్ణేతలను ఆకర్షించింది. దాన్ని కాస్త సిల్వర్ అవార్డుకు ఎంపిక చేశారు పౌల్ అండ్ మైక్ సంస్థ కొచ్చి కేంద్రంగా పనిచేస్తోంది .సీతాఫలం, నేరేడు, పుదీనా, బాదం, మిరియాలు, నారింజ తొక్క వంటి ఫ్లేవర్ లతో చాక్లెట్ లు తయారు చేస్తున్నారు. వారిదే ఆరెంజ్ పీల్ చాకోలెట్లు అండ్ సెచువాన్ పెప్పర్ ఫ్లేవర్ తో రజిత అవార్డ్ సాధించింది