Categories
మహిళలపై జరిగే తీవ్ర నేరాలకు అరికట్టేందుకు న్యాయస్థానం ఎన్నో చట్టాలు చేసింది. ఒక్క నేరానికిగాను సంబంధిత సెక్షన్ల ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించే హక్కు న్యాయస్థానానికి ఉంది వరకట్న హత్యలను ఐ పి సీ 304 బి నేరంగా పరిగణిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం వివాహం జరిగిన పదేళ్ళ లోగా ఒక మహిళ కాలిన గాయాలతో లేదా శరీరం పై ఇతర గాయలు కారణంగా మరణించి నట్లయితే చట్టం దాన్ని వరకట్న హత్యగా పరిగణిస్తుంది. ఇలాటి సంఘటనతో నింధితులను పదేళ్ళ కఠిన కారాగార శిక్షణ నుంచి యావజ్జివ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.