Categories
ఇది జనరేషన్ జ్యువలరీ ట్రెండ్.ఒకే నగని నాలుగైదు రకాలుగా, లేదా ఒకే ఆభరణాన్ని ఒకేసారి ముగ్గురు నలుగురు పెట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు.ఈ జనరేషన్ జ్యువలరీ లు వజ్రాలు నెక్లెస్ లకు దాని డిజైన్ అనుసరించి సైజ్ ని బట్టి రెండు మూడు హుక్ చైన్ ఉంటాయి . ఇందులో లాకెట్ ని ఏదైనా వేరే చైన్ తో కలిపి వేసుకోవచ్చు. ఏదైనా పెళ్లి వేడుకల్లో ఒక్కరే ఈ నాగదారిస్తే ఎంతో గ్రాండ్ గా ఉంటుంది.నిజానికి ఈ రకమైన డైమండ్ నెక్లెస్ లు పెళ్లి కూతుళ్ల ప్రత్యేకం మరి ఆ వేడుక అయ్యాక ఇంత వెడల్పాటి నగలు ఏ చిన్న ఫంక్షన్ కో వేసుకోలేరు అందుకే ఇలా విడదీసి రెండు మూడు ప్రత్యేకమైన నగలు పెట్టుకునేలా తయారు చేస్తున్నారు.