ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లా లో అత్యున్నత స్థాయి అధికారులంతా మహిళలే జిల్లా కలెక్టర్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చీఫ్ మెడికల్ సూపర్డెంట్ తాసిల్దార్ వరకు 17 కీలక పదవుల్లో మహిళలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా సునీతి పగ్గాలు చేపట్టడం తో ఆ సంఖ్య 18 కి చేరింది. మేమంతా మహిళలం కనుక మా ఆలోచనా రీతి ఒకే తీరుగా ఉంటుంది. అభివృద్ధి దిశగా ఆలోచించడం అమలు చేయటం సులువుగా అవుతుంది అంటారు కలెక్టర్ నేహ జైన్ అక్కడ నలుగురు శాసనసభ్యుల్లో ఇద్దరు, ప్రతిభ శుక్ల,  నిర్మల శంకవర్ కూడా మహిళలు కావడం ఇంకో ప్రత్యేకత.

Leave a comment