హారూన్ విడుదల చేసిన అత్యంత ధనవంతులైన భారతీయుల జాబిదాలో తోలి వంద మందిలో అత్యంత ధనవంతురాలైన తోలి మహిళగా నిలిచారు కిరణ్ మంజుదార్ షా. ఆస్ట్రేలియా లో మాల్టింగ్ అండ్ బ్రూవింగ్ లో పట్టా తీసుకున్న కిరణ్ షా బయోకాన్ లో భాగస్వామిగా చేరారు. సంవత్సరం తిరిగేలోగానే భారత్ లో తొలి ఎంజైమ్ ల తయారీ సంస్థ గా నిలబెట్టారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె పోటుని దరిచేరనీయని ఉత్పత్తులతో సంచలనం సృష్టించారు. గత ఏడాది కన్నా ర్యాంక్ తగ్గినా 28.200 వందల కోట్ల సంపద తో హరూన్ జాబితాలో సిరిమంతురాలు గా నిలిచారు.