ఇప్పుడు మనందరికీ తాజాగాలి,మనసుకు ప్రశాంతత కావాలి అంటోంది హీరోయిన్ తాప్సీ.ఆన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో అందరూ షూటింగ్ లకు హాజరవుతున్నారు.కొందరు బయట ప్రదేశాలకు విశ్రాంతి కోసం వెళ్తున్నారు.తాప్సీ ఇప్పుడు జైపూర్ లో ఉంది.ఐదు నెలలుగా ఇంట్లోనే ఉన్నాను.ఇప్పుడు మళ్లీ పని కోసం వెళ్లే సమయం వచ్చింది. ఇప్పుడు ప్రశాంతత కావాలి ఒత్తిడినుంచి విముక్తి కావాలి.కరోనా ఆలోచనలు నుంచి తేరుకొనే శక్తి కావాలి.వైరస్ అనే కాదు, ఏ కష్టం లోంచి అయినా బయటకు రావాలంటే ముందు మన మనసులోంచే ఆ ధైర్యం రావాలి అంటోంది తాప్సీ.

Leave a comment