Categories
టూరమెలిన్ లేదా తోరమణులు ఎన్నో రంగుల్లో దొరికే రత్నం వాటిల్లో వాటర్ మిలన్ టూరమెలిన్ ఆకుపచ్చ గులాబీ వర్ణం కలిసి అచ్చం పుచ్చకాయ ముక్కలు లాగే ఉంటుంది. ఈ రాళ్లని గుచ్చి వేసుకునే ట్రెండ్ మొదలైంది. బ్రెజిల్ లోని పరైబా ప్రాంతంలో దొరికే నీలిరంగు టూరమెలిన్ క్యారెట్ లక్షా యాభై వేల పైనే ఖరీదు చేస్తుంది. సహజమైనవి వజ్రాల్లాగా దృఢంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో వీటిని నగల్లో కూడా అమర్చుతున్నారు. వీటి మెరుపును బట్టి ఇవి సహజమైనవిగా గుర్తించవచ్చు. బీటలు వారిన, లేదా పూర్తి పారదర్శకంగా ఉన్నఅవి కృతిమమైనవిగా గుర్తించవచ్చు. పలు వరుసల్లో గుచ్చి వేసుకొనే ఈ రత్నల దండలు చాలా అందంగా ఉంటాయి.