Categories
మగవాళ్ళ తో పోలిస్తే వహిళలు బరువు తగ్గటం కొంచెం కష్టమే అంటున్నారు పరిశోధికులు. ఆహారం ద్వారా వచ్చే క్యాలరీలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయంలో మెదడు లోని ఒక భాగం ప్రభావం చూపెడుతోంది. ఆ భాగానికి సంబంధించి,స్త్రీ పురుషులు భిన్నంగా రెస్పాండ్ అవుతారంటున్నాయి పరిశోధనలు. ఆ ప్రాంతంలోని కణాలు ముఖమైన మెదడు హార్మోన్లని తయారు చేస్తాయని,అవి ఆకలి,శారీరక శ్రమ,శక్తి వినియోగం,శరీరం బరువును నియంత్రిస్తాయంటున్నారు మహిళల్లో ఈ హార్మోన్లు శారీరక శ్రమ,శక్తి వినియోగాన్ని నియంత్రించటంలో కాస్త తక్కువ పనిచేస్తాయంటున్నారు.