ఈ సీజన్ లో వాక్కయలు ఎక్కువగా వస్తాయి.ఈ వర్షాల్లో జలుబు, దగ్గు, అజీర్తి వంటి సమస్యలు ఎక్కువ.వీటికి ప్రకృతి సిద్ధమైన ఔషధం వక్కయులే.వాక్కాయి అరుగుదలను పెంచుతుంది.కూరలలో చింతపండు బదులు వాక్కాయి వాడవచ్చు.వీటిలో విటమిన్ సి చాలా ఎక్కువ పచ్చడి లాగా సలాడ్ లాగా చేసుకోవచ్చు.ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఆందోళన తగ్గిస్తాయి.ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ పెంచుతాయి. పప్పు, పులిహోర, సాంబారు,మురబ్బా, హల్వా ఇలా ఎన్నో రకాలుగా వాక్కాయిను  రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు..వాక్కాయ కొబ్బరి ముక్క లు పచ్చి మిరపకాయలు వెల్లుల్లి ఉప్పు వేసి నూరిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment