Categories
అల్లం ఎండనిచ్చి చేసే శొంఠిపొడి ఈ సీజన్ కు చాలా మంచిది. ఇది చక్కని ఔషధం కూడా . ఈ చల్లని గాలులకు వచ్చే దగ్గు జలుబులకు ప్రతి రోజు గోరు వెచ్చని నీళ్ళలో శొంఠిపొడి,బెల్లం కలిపి తాగుతూ ఉంటే ప్రయోజనం కనిపిస్తుంది. వేడి అన్నంలో కొంచెం శొంఠిపొడి,పప్పునూనె కలిపి ప్రతి రోజు భోజనంలో తొలిముద్దగా తింటే ఆకలీ,జీర్ణశక్తి రెండు బావుంటాయి. ప్రతి రోజు మజ్జిగలో శొంఠిపొడి,నిమ్మరసం,ఉప్పు కలిపి తాగుతువుంటే ఆరోగ్యంగా ఉంటుంది. జలుబుకు నీళ్ళలో శొంఠిపొడి వేసి మరగనిచ్చి తాగితే ఉపశమనంగా ఉంటుంది.