అకాడమీ ఆఫ్ ఐకిడో ఇండియా ద్వారా కలకత్తాలోని మురికివాడల్లో పిల్లలకు యుద్ధ కళల్లో తర్ఫీదు ఇస్తోంది సంయుక్తా రాయ్. అట్టడుగు వర్గాల వారికి మార్షల్ ఆర్ట్స్ అవసరం ఎక్కువ. అందుకే నా విద్యను వారి దగ్గరకు తీసుకు వెళ్తున్నాను అంటారు సంయుక్త. ఆమె పుట్టింది పెరిగింది ఢిల్లీలో హస్త కళల పై ఉన్న మక్కువతో టెక్స్ టైల్స్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు. 19 సంవత్సరాలు గా టెక్స్ టైల్స్ డిజైనింగ్ వ్యాపారం లో ఉన్నాను. యుద్ధ కళలను ఆమె ప్రాక్టీస్ చేశారు. విద్యార్థులు, ప్రజలు ఆమెను కుంగ్ ఫూ మేడం అని పిలుస్తారు.

Leave a comment