జీన్స్, షార్ట్, స్కర్ట్, లాంగ్ స్కర్ట్ వేటి తో నైనా షర్టు కలిపి వేసుకుంటేనే ట్రెండీ లుక్ కనిపిస్తుంది. వదులుగా ఉండే ఓవర్ సైజ్ షర్ట్ లు  ధరించటం ఒక ఫ్యాషన్. వదులుగా ఉండే షర్ట్ తో పాటు పెన్సిల్ డ్రెస్ వేసుకోవాలంటున్నారు ఫ్యాషన్ ఎక్సపర్ట్స్. ఈ షర్ట్ లు క్రాప్స్ లో జీన్స్ తో కూడా బావుంటాయి. అలాగే ఓవర్ సైజ్ షర్ట్, రిప్పేడ్ డెనిమ్స్ కి సరైన జోడీ. షర్ట్ తో పాటు యాక్సెసరీలు కూడా ఫ్యాషన్. పొడవాటి ఓవర్ సైజ్ షర్ట్ లో నడుముకు వెడల్పాటి బెల్ట్ ధరించాలి. రిస్ట్ బ్యాండ్, చెవులకు హోప్స్ బావుంటాయి చోకర్ చైన్ లు కూడా రూపాన్ని గ్లామరస్ గా మారుస్తాయి.

Leave a comment