Categories
రాధిక రామస్వామి భారతదేశంలో తొలి మహిళా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన రాధిక రామస్వామి ఢిల్లీలో స్థిరపడి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా పక్షులను కెమెరాలో బంధించటం మొదలుపెట్టారు. భారతదేశంలోని అన్ని అభయారణ్యాల లో తిరిగి అంతరించిపోతున్న పక్షి జాతుల ఫోటోలు తీశారు. తర్వాత ఆఫ్రికా అడవుల్లో ఫోటోలు తీశారు. మనకు ప్రకృతి ఎంత సమృద్ధమైన వనరులు ఇచ్చిందో అడవుల్లో తిరిగితేనే తెలుస్తుంది అంటుంది రాధిక రామస్వామి. వన్య ప్రాణుల తమ జీవితాలను ప్రదర్శనకు పెట్టవు మనుషుల్లాగా వాటిని తెలుసుకోవటం, రక్షించుకోవడం మన బాధ్యత అంటారు రాధికా రామస్వామి.