ఎండలు వచ్చేస్తున్నాయి. చర్మ రక్షణకోసం మంచి ఫేస్ వాష్ ఎంచుకోవాలి.  అయితే షేస్ వాష్ లో వాడే వస్తువుల వల్లే చర్మం చక్కగా మెరుస్తుంది.  సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడేది టిట్రీ నూనె .  బయటి వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉంటే ఈ నూనెకు ప్రాముఖ్యత ఇవ్వవచ్చు.  అలాగే నిమ్మనూనె  ఎండలో తిరగటం వల్ల చర్మం కమిలి పోతే ఈ నూనె ఉన్న ఫేస్ వాష్ తో మొహాం కడుక్కొంటే మంచి ఫలితం ఉంటుంది.  కలబంద ద్వారా చర్మానికి కావలసిన తేమ అందుతోంది,  చర్మాన్ని మృదువుగా ఉంచుతోంది.  ఫేస్ వాష్ లో కలబంద వుండాలి. అలాగే చర్మ ఛాయలు మెరుగు పరిచే పసుపు కూడా చాలా ముఖ్యం .  ఫేస్ వాష్ లో పసుపు ఉంటే మొటిమలు, మచ్చలు కూడా మాయం అవుతాయి.

Leave a comment