పరీక్షల వత్తిడితో పిల్లలు ఎంతో కంగారు పడతారు . ముందు వారిని ఆరుగంటలు నిద్రపోయేలా చూడాలంటున్నారు ఎక్స్ పర్ట్స్.  మెదడు ఉత్తేజితమై సామార్థ్యం రెట్టింపు అవటంతో పాటు చదివినవి గుర్తు పెట్టుకొనే శక్తి పుంజు కుంటుందంటారు. అలాగే ప్రతిరోజు వ్యాయామం కోసం కొంత సమయం కేటాయిస్తే మెదడుకు రక్త ప్రసరణ జరిగి శక్తిమంతంగా ఉంటుంది. చదువు మధ్యలో విరామం తీసుకొంటూ కాసేపు సైకిల్ తొక్కడం , ఆటలాడటం చేయాలి.  ఆటలకు ప్రాధాన్యత ఇస్తే నాడులు ఉత్తేజితమౌతాయి.  పిల్లల జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉండాలంటే దానికి మెదడుకు పూర్తి విశ్రాంతి ఇచ్చే నిద్రే మందు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment